ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 4:
కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయశాఖ మాత్యులు కొండా సురేఖా కీసర గుట్టలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కీసరలో సామూహిక దీపొత్సవ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. మంత్రి ధ్వజస్తంభం పై ఆకాశ దీపాన్ని వెలిగించి, అనంతరం దీపాలను నీటిలో వదిలారు.
ఈ కార్యక్రమాలను మాధవానంద సరస్వతి స్వామి దగ్గరుండి మంత్రితో పూజ కార్యక్రమాలను నిర్వహింపజేసారు. మంత్రితో పాటు దేవాదాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ , దేవాదాయ శాఖ కమీషనర్ ఈ పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్‌రెడ్డి, కీసర ఆర్డిఓ సైదులు, తహాసీల్దారు, ఆలయ ఛైర్మన్ నాగలింగం, ఆలయఈఓ సుధాకర్ రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.