ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంగెపు నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు కాగా వారి కుటుంబాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆర్థికసాయం అందించారు. ఆపదలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.