ఖమ్మం ప్రతినిధి జూన్ 20 (ప్రజాబలం) ఖమ్మం సుడా చైర్మన్ గా బచ్చు విజయకుమార్ మూడు సంవత్సరాలు దిగుజ్వేయంగా పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్న శుభపరణ్యంలో బైపాస్ రోడ్ దొరపల్లి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపి అభినందించి మాట్లాడారు . సుడా వచ్చిన కానుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని , భూములు గాని పేదలు గాని ఎంతో ఉపయోగపడిందని సుడా వల్ల లాభమే గాని నష్టం లేదని అన్నారు . అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పోతూ ప్రజల మనలను పొందిన సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ ను శాలవతో సత్కరించారి వారితో ఉన్న అనుభూతిని పంచుకున్నారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుడా డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ సభ్యులు , బిల్లర్ అసోసియేషన్ సభ్యులు టీఎన్జీవో సభ్యులు ప్రముఖ వ్యాపారస్తులు ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘల నాయకులు వివిధ శాఖల అధికారులు అభిమానులు శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.