వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 1:
తెలంగాణా రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు గ్రూప్-2, గ్రూప్-3 మరియు గ్రూప్-4 పోటీ పరీక్షల కోసం మైనార్టీ అభ్యర్థులకు వరంగల్ జిల్లాలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించుటకు నోటిఫికేషన్ జారీ చేయనైనది. ఇట్టి శిక్షణ తరగతులు (60) రోజులు కంబైన్డ్ (గ్రూప్ II & III) కోచింగ్ మరియు (45) రోజులు గ్రూప్ -4 కోచింగ్, నిర్వహించబడును.
కావున ఆసక్తి గల అర్హులయిన మైనారిటీ (ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, బుద్దులు, జైనులు మరియు పారసీకులు) అభ్యర్థులు అవసరమైన సర్టిఫికేట్ కాపీలను జత చేస్తూ తమ దరఖాస్తులను జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి గారి కార్యాలయము, వరంగల్ జిల్లా, బి.2 క్వార్టర్స్, సర్ర్క్యూట్ గెస్ట్ హౌస్ ఎదురుగా, ఎక్సైజ్ కాలని రోడ్, హనుమకొండ నందు దివి: -03-2023, సాయంత్రం గం. 4.00 ల లోగా సమర్పించగలరని తెలియచేయనైనది.
మరిన్ని వివరములకు సెల్ నంబర్ : 9963978386 మరియు 0870- 2980533 లను సంప్రదించగలరు.