కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి- కాట
తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే
…..కాట శ్రీనివాస్ గౌడ్
సంగారెడ్డి ఫిబ్రవరి 13 ప్రజ బలం ప్రతినిధి
రామచంద్రపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ర్యాలీగా వెళ్లి శ్రీనివాస్ నగర్ కాలనీలోని రాయల్ మదీనా కమ్యూనిటి హాల్ లో రామచంద్రపురం జనరల్ సెక్రెటరీ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో కాట శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి 100 మంది మైనారిటీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో 11% రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేసిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల కన్నీరు ఆగడం లేదని ఆవేదం వ్యక్తం చేశారు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కాట శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో హబీబ్, తాహిర్, నాసిర్ అమీర్, సతీష్ గౌడ్, శాంతమ్మ, శ్రీరాములు, వాజీద్, పీటర్, నవీన్ గౌడ్,ఆనంద్ గౌడ్, రసూల్, మిరాజ్, అజ్జు, శంకర్, రవి, నాగేష్, పాషా, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.