రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 నవంబర్ 2024
మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు చంద్రకాంత్ గౌడ్, మాల్యాద్రి నాయుడు,అందె లక్ష్మణ్ రావుల ఆద్వర్యంలో తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పసిగట్టిన దేమనగా మణికొండ మునిసిపల్ అధికారుల ఆదేశానుసారం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మునిసిపల్ నిధులను ఎంతో ఖర్చు పెట్టి మణికొండలో చాలా చోట్ల రోడ్డు మధ్యన మొక్కల పెంపకం చేయడం సంతోషదాయకమని, కానీ హారితా హారం పెర బడ్జెట్ ఉన్నను అట్టి మొక్కలకు తగిన విధముగా అవసరమైన నీటిని సమయానికి అందించకుండా, సరియగు నిర్వహణ చేయకుండా గాలికి వదిలిపెట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణలో మునిసిపాలిటీ అధికారులు పూర్తిగా విఫల మైనారని పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలుపుతూ ఈ విషయమై పరిశీలనకు గాను బీ ఆర్.ఎస్.పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలసి కట్టుగా గోల్డెన్ టెంపుల్ కూడలిలో కలుసుకొని పాదయాత్ర మొదలుపెట్టి పర్యవేక్షణ లోటుతో పాటూ మొక్కల మధ్య మధ్య కరెంట్ తీగలు, తీగల బాక్స లు ఉండడం గమనించి అందు వలన ప్రజలకు ప్రాణ హాని కలిగించ వచ్చనీ లోటు పాట్లను పరిశీలించడ మైనదని ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ నవీన్ కుమార్, ముత్తoగి లక్ష్మయ్య, ఉపెందర్నాథ్ రెడ్డి, యాలల కిరణ్, షేక్ ఆరీఫ్, జైరాం, బోడ్డు శ్రీధర్, భాను తది తరులు పాల్గొనీ వెంటనే మణికొండ మునిసిపల్ కమిషనర్ దృష్టి కి తీసుకెళ్లడం జరిగినది.
