రేగొండ మండలం, గడిపల్లి గ్రామంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిబాయి బంబానియా పర్యటించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యా, ఆరోగ్య, రైతుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి 8వ తరగతి విద్యార్థులచే బయాలజీ పాఠాన్ని చదివిపించి, మంచిగా చదివారని అభినందించారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో అనుబంధం పెంచుతూ వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.
అంగన్ వాడి కేంద్రంలో మంత్రి గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా మాతా శిశు ఆరోగ్యానికి, పిల్లల విద్యకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషన్ 500 యాస్పిరేషన్ బ్లాకులను ప్రకటించినట్లు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరింత మందికి చేరువవ్వాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించి ప్రతి రోజు ఎంత మంది వైద్య సేవలకు వస్తుంటారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి మాతా శిశు మరణాలు లేకుండా మొదటి దశ నుండే గర్భిణీల నమోదు చేస్తూ ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రూపిరెడ్డి పల్లి రైతులతో ముకాముఖీ నిర్వహించారు. రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగు చేయాలని సూచించారు. రైతులు భూ సార పరీక్షలు నిర్వహించి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల తో భూ సారాన్ని బట్టి పంటల సాగు చేయడంతో పాటు అధిక దిగుబడు లు సాదించాలన్నారు. రైతులు పంట ఉత్పత్తులు గిట్టుబాటు ధరలకు విక్రయించడానికి అవసరమైన సి డబ్ల్యూసి కేంద్రాలను అందుబాటులో కి తేవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో మహా ముత్తరాం, పలిమెల మండలాలను నీతి ఆయోగ్ యాస్పిరేషన్ బ్లాకులుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ మండలాల్లో వ్యవసాయ, విద్యా, వైద్య, డిఆర్డీఏ, ఉద్యాన, సంక్షేమ శాఖలకు పారామీటర్లు నిర్దేశించామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రి అదనపు కార్యదర్శి ఖుష్బూ
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, జిల్లా వైద్యాదికారి డా మధుసూదన్, సంక్షేమ అధికారి చిన్నయ్య, డీఈఓ రాజేందర్, సీపీఓ బాబూరావు, తహసీల్దార్ శ్వేతా, ఎంపిడిఓ వెంకటేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.