ప్రజా బలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : లక్షెట్టిపేట అభివృద్దే ప్రభుత్వం అభిమతమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కొనియాడారు. మున్సిపాలిటీ లను సుందరంగా తీర్చిద్దిటంలో అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ లో చేసినట్లు తెలిపారు.స్థానిక గాంధీ చౌక్ నుంచి మండల పరిషత్ వరకు బీటీ రోడ్ అదేవిధంగా సబ్ స్టేషన్ నుంచి కస్తూరభా గాంధీ,మసీద్ నుంచి రైస్ మిల్ వరకు సుమారుగా రూ. కోటి డెబ్భై లక్షలతో పనులు చేస్తున్నామన్నారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య మాట్లాడుతూ…. మున్సిపాలిటీ లో అవినీతి లేని పాలన ను అందిస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య,కౌన్సిలర్లు చింత సువర్ణ, గోడిసేల లక్ష్మీ,సురేష్ నాయక్, మెట్టు కళ్యాణి,నాయకులు, అధికారులు పాల్గొన్నారు.