ప్రభుత్వ మెడికల్ కాలేజ్,ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ తో పాటు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి,
మెడికల్ విద్యార్థులకు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, ఏరియా హాస్పిటల్ లో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు, వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking