తూప్రాన్, జనవరి 11 (ప్రాజబలం న్యూస్):
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోతురాజుపల్లిలోని వడ్డెరి కాలనీ వాసులు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ జయంతి ఉత్సవాలకు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బర్త్డే కేకు కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ జయంతి కార్యక్రమంలో వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్స్ పల్లెర్ల రవీంద్ర గుప్తా, భగవాన్ రెడ్డి, దుర్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి, ఉమర్, వడ్డెర యువజన సంఘం అధ్యక్షులు గొలుసుల నరసింహులు, కృష్ణ, ఉపాధ్యక్షులు శంభాయ్య, సభ్యులు నర్సింలు, ప్రశాంత్, నవీన్, బిక్షపతి, పరశురాములు, జహంగీర్, లక్ష్మీనారాయణ, యాదగిరి, చెలిమల కృష్ణ, పలువురు పాల్గొని విజయవంతం చేశారు.