వీణవంక ప్రజా బలం ప్రతినిధి జూన్ 25
కాంగ్రెస్ పార్టీ నాయకుల వేసిన సవాల్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించారు. చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తుండగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పోలీసులు వీణవంక ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసారు. గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు అవినీతిని నిరూపించమని సవాలు విసురుతారు.. మళ్ళీ వారే పోలీసులను పంపి అరెస్ట్ చేయించుతారు. ఇదేనా కాంగ్రెస్ నేతల తీరు? ప్రభుత్వం మీదే కదా? పోలీసు యంత్రాంగం మీ కను సన్నల్లోనే నడుస్తోంది కదా? ఇప్పటి కైనా నా సవాల్ కు సిద్ధం కండి! నేను ఒక్కడినే వస్తాను.. కార్యకర్తలు కూడా నా వెంట రారు. నన్ను విడిచి పెట్టండి.. నేను చెల్పూర్ హనుమాన్ దేవాలయం వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పోలీసులకు చెప్పండి.. దమ్ముంటే నన్ను అనుమతించండి అని అన్నారు. నేను గతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమని అప్పటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి విసిరితే రాలేదు.. మేము హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో కూర్చొని చాలాసేపు వేచి చూశాము. సవాల్ అంటే అది. నా సవాల్ ఎప్పుడైనా ఆ విధంగానే ఉంటుంది అని అన్నారు. ఈరోజు దేవుడి సాక్షిగా మీరు చేసిన సవాలుకు నా నిజాయితీ నిరూపించుకునేందుకు నేను తడి బట్టలతో ప్రమాణం చేస్తున్న.. నేను ఎక్కడ కూడా ఒక అవినీతి చేయలేదు.. చేసే అవుసరం నాకు లేదు.. చెయ్యను కూడా..
మంత్రి పొన్నం ప్రభాకర్ ను నేను సవాల్ చేస్తున్న.. రేపు 12 గంటలకు నువ్వు అపోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చి నా సవాల్ ని స్వీకరించి నీ నిజాయితీ నిరూపించుకో.. ఒకవేళ నువ్వు రాకపోతే నువ్వు అన్ని స్కామ్ లు చేసినట్లే.. అక్రమంగా నువ్వు వేల కోట్ల రూపాయలు దోచుకున్నావని ఒప్పుకున్నట్టే అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.