అరుణాచలేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మువ్వావిజయబాబు తుళ్లూరిబ్రహ్మయ్య మేకల మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 13(ప్రజాబలం) ప్రతి సంవత్సరం ఇదే భరణి కృతికా నక్షత్రం రోజు న అరుణాచలంలో మహా దీపోత్సవం (మహాజ్యోతి సందర్శన )కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరు బ్రహ్మయ్య, చంద్రశేఖర్ అరుణగిరి ప్రదక్షిణం చేసి, మహాజ్యోతి ని సందర్శించి అరుణాచలేశ్వరుని దర్శించుకున్నారు ఈ సందర్బంగా వేలాదిమంది భక్తలకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ మహా దీపోత్సవము రోజున అన్నదానం నిర్వహించడం, మహా జ్యోతి దర్శనం , స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం గా ఉందని, అదృష్టం గా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు . ఈ రోజు తెలంగాణ నుండి మరియు ఇతర రాష్ట్రాలనుండి ఈ దివ్య జోతి సందర్శనం కొరకు లక్షలాది భక్తులు తరలిరావడం గొప్ప విశేషం . ఈ రోజు న పవిత్రమైన అరుణాచలంలో గిరి పై మహా జోతి ప్రారంభమైనాక, అరుణాచలం లో దీపాలు వెలిగిస్తారు. పవిత్రమైన ఈ రోజు న గిరి ప్రదక్షిణ చేస్తే 1000సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమం లో కటకం శ్రీనివాసరావు,చంద్రశేఖర్, మహేష్ స్వామి, వేణు, బ్రహ్మారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking