ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 13 : మంచిర్యాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిగా జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుమర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.