హోదాను తగ్గించి.., అతి సామాన్యుడిగా ఎంఎల్ఏ వేముల

నల్గొండ జిల్లా :- గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు మరోసారి తన హూందతనాన్ని తగ్గించి.. అతి సామాన్యుడిగా వ్యవహరించాడు.
బుధవారం నాడు నకిరేకల్ పట్టణంలోని తన ఆధార్ కార్డు నవీకరణ కోసం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని MRO ఆఫీస్ లో గల ఆధార్ కేంద్రానికి వెళ్ళారు..
అప్పటికే అక్కడ ఉన్న ప్రజలు ఆధార్ నవీకరణ కోసం తమ ఇబ్బందులను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే MLA గారు సంబంధిత జిల్లా ఆధార్ కేంద్ర అధికారితో మాట్లాడి, తను నవీకరణ చేయించుకోకుండానే వెనుదిరిగి సామాన్య ప్రజలకు ముందుగా అవకాశం కల్పించాడు. జిల్లా అధికారి తక్షణమే ఒక మొబైల్ ఆధారిత ఆధార్ సెంటర్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేశారు!

Leave A Reply

Your email address will not be published.

Breaking