ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీలు విఫలం తపస్

 

మెదక్ నర్సాపూర్ ప్రజా బలం న్యూస్:-

మహబూబ్ నగర్,హైదరాబాద్, రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి (A.V.N) ఎవిఎన్ రెడ్డిని గెలిపించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాగజ్ మద్దూర్ లో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని పలు పాఠశాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్సీ విఫలమయ్యారని, బదిలీలు, పదోన్నతులు, భాషా పండితుల అప్గ్రేడేషన్ , ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు . వీటిని పరిష్కరించాలంటే తపస్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి AVN రెడ్డిని గెలిపించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్సు జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, తపస్ నాయకులు మల్లేష్, చెన్నారెడ్డి, సాయి కృష్ణ, కృష్ణ, షరీఫ్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking