గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సహకారం
మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా
వైద్య మరియు ఆరోగ్య అధికారి
డాక్టర్ టి. రఘునాథ్ స్వామి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 7:
ఈరోజు మొబైల్ మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఇది ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు అవగాహనా కార్యక్రమం. గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం క్రింద, ఎ ఐ జి హాస్పిటల్స్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గగిల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగింది.
ప్రారంభోత్సవంసభలో
డాక్టర్ టి. రఘునాథ్ స్వామి మాట్లాడుతూ,
మహిళల్లో అధికంగా కనిపించే రొమ్ము క్యాన్సర్‌ను తొందరగా గుర్తించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. మొబైల్ మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ గ్రామీణ మరియు వెనుకబడ్డ ప్రాంతాల్లో మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అవసరమైన సదుపాయాలను అందజేస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి, తగిన వైద్యం అందించడం ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ ఉచిత సేవను ఉపయోగించుకోవాలని సూచించారు.
గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా చిగురుపాటి మాట్లాడుతూ, రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా విజయవంతమైన చికిత్సకు అవకాశాలు మెరుగుపడతాయని, అలాగే మహిళలు తమ ఆరోగ్యం పట్ల చైతన్యంగా ఉండాలని సూచించారు.
ఎ ఐ జి హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రగ్యా చిగురుపాటి మాట్లాడుతూ,
ఈ మొబైల్ యూనిట్ జిల్లా వ్యాప్తంగా అనేక మహిళలకు స్క్రీనింగ్ మరియు కన్సల్టేషన్ అందించడానికి సిద్దంగా ఉందని చెప్పారు, రిమోటు ప్రాంతాల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమానికి దుండిగల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ శంభిపూర్ కృష్ణ, గగిల్లాపూర్ కౌన్సిలర్ శ్రీమతి అరుణ నాగరాజు, మల్కాజ్‌గిరి డివిజన్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సరస్వతి, దుండిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వర్ణలతతో పాటు
ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు హాజరయ్యారు.