గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 7 జనవరి 2025
మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జల మండలి వారికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేకించి వారు త్రవ్వి పెట్టిన హుడా కాలనీ లాల్లమ్మ గార్డెన్ కూడలి, సాయి చంద్ర కాలనీ ల వద్ద రహదారుల నిర్వహణ సరిచేయాలని, కాండిట్, సుందర్ గార్డెన్ లీకేజీలు సరి చేయమని పిర్యాదు చేయడానికి బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో జల మండలి కార్యాలయానికి కలసి కట్టుగా వెళ్ళి జల మండలి అధికారులు డి,ఇ – ఏ.ఈ లను కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా సమస్యల పరిష్కారం చేస్తామని అధికారులు చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో రూపా రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, గుట్టమీది నరేందర్, గొరికంటి విఠల్, సంగం శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, కిరణ్, షేక్ ఆరీఫ్, అరిఫ్ మొహమ్మద్, బొడ్డు శ్రీధర్, విజయలక్ష్మి, సుమ, తిరుపతి తది తరులు పాల్గొన్నారు.