పిల్లలకు దోమల బెడద నుండి నివారించడం కోసం ఏవేర్నెస్ ప్రోగ్రాం

ప్రజాబలం ప్రతినిధి
పిల్లలకు దోమలు పిల్లలకు దోమల బెడద నుండి నివారించడం కోసం ఏవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. విజ్ఞాన్ గ్రామర్ హై స్కూల్ డైరెక్టర్ నిర్మలారెడ్డి.ఈ కార్యక్రమం నిర్వహణలో విజ్ఞాన్ గ్రామర్ హై స్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు స్కూల్ స్టాప్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక వహించిన జిహెచ్ఎంసి స్టాప్ కిరణ్ కుమార్ , బాలరాజు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన స్కూల్ డైరెక్టర్ నిర్మలా రెడ్డి.

వర్షాకాలంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఎక్కడా నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా… ఉదాహరణకు పూల మొక్కల హుండీలలో , వాడి పారేసిన టైర్లలో , చిన్న చిన్న గుంతల్లో నీరు నిలవ లేకుండా చూసుకోవాలన్నారు .పరిసర ప్రాంతాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు . శుభ్రత లేనిచో ఈ కాలంలో డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన అంటువ్యాధులు వ్యాపిస్తాయని అందుకు ముందు జాగ్రత్త చర్య గా విద్యార్థిని విద్యార్థులలో ఉపాధ్యాయ బృందం తో పాటుగా జిహెచ్ఎంసి వారితో అవేర్నెస్ ప్రోగ్రాం చేయించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని విజ్ఞాన్ గ్రామర్ హై స్కూల్ చైర్మన్ & డైరెక్టర్ నిర్మలారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking