ఎంపీ గాయత్రి రవి మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి గాయత్రి జన్మదిన సందర్భంగా కేరమ్స్ పోటీలు ప్రారంభం
ఖమ్మం ప్రతినిధి జనవరి 23 (ప్రజాబలం) ఖమ్మంరాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ఆకాంక్షించారు. ఈనెల 24న ఎంపీ గాయత్రి రవి జన్మదిన సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల మధ్య క్యారమ్స్ పోటీలను నిర్వహించారు. అడ్వాన్సుగా ఒకరోజు ముందుగా ఎంపీ గాయత్రి రవి జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో గాయత్రి రవి జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులను అందజేశారని, ప్రతి పండగ, ఇతర శుభా కార్యాలకు గాను తన వ్యక్తిగతంగా జర్నలిస్టులకు ఆర్థికంగా సాయపడుతూ వస్తున్నారని తెలిపారు.
అటువంటి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండటం సంతోషదాయకమన్నారు. నేడు జరుపుకునే జన్మదిన వేడుక భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటూ, ఆయురారోగ్య , అష్ట ఐశ్వర్యలతో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొరకొప్పల రాంబాబు, బిక్కీ గోపి, ముత్యాల కోటేశ్వరరావు, యలమందల జగదీష్, అమరవరపు కోటేశ్వరరావు, టీఎస్ చక్రవర్తి, వనం నాగయ్య, జీవన్ రెడ్డి, పిన్ని సత్యనారాయణ దండాల ప్రభాకర్ రెడ్డి పానకాలరావు, రోసి రెడ్డి జానీ భాషా,ఉత్కంఠం శ్రీను, యాదగిరి, అశోక్, పురుషోత్తం, సాయి, ఉపేందర్, రవి, ఈశ్వరి, సంపత్ వెంకటేశ్వర్లు మధు నాగేశ్వరరావు మల్సూరు పులి శ్రీనివాస్ వెంకటేష్ గోపి షేక్ సయ్యద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.