ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ నామ నాగేశ్వరావు

 

సంక్రాంతి వేళ ప్రజలకు భోగ, భాగ్యాలు, సిరి సంపదలు, ఆయురా రోగ్యాలు కలగాలి

చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలి

మంచి వర్షాలతో పంటలు విస్తారంగా పండాలి

సరికొత్త ఉషోదయానికి స్వాగతం పలుకుదాం

పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

భోగి పండుగ మనల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తుంది

ఖమ్మం ప్రతినిధి జనవరి 13 (ప్రజాబలం) ఖమ్మం సంబురాల భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆనందోత్సాహాలు ఉప్పొంగే ఉత్సాహాంతో అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి భాగ్యాలతో , సంక్రాంతి సిరి సంపదలతో, కనుమ పండుగలను కనువిందుగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ భోగి వెలుగు మనలందర్నీ ఉజ్వల భవిష్యత్‌ వైపు నడిపిస్తుందన్నారు. తరిగిపోని ధాన్యపు రాశులతో.. తరలివచ్చే సరిసంపదలు, ఆయురారోగ్యాలు.. తిరుగులేని అనుబంధాల అల్లికలతో అందరి జీవితాలు ఎప్పుడూ దిన దినాభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుందన్నారు ఈ పండుగను చిన్నా పెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుకన్నారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను తెచ్చిపెడుతుంది భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమేనన్నారు తొలి రోజు జరుపుకునే భోగి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్ధమే భోగి పండుగ విశిష్టత అన్నారు. చెడు ఆలోచనలకు స్వస్తి పలికి, కొత్తమార్గంలో పయనించాలని అన్నారు. ఇంటికొచ్చే పాడి పంటలు,ఈ భోగి అందరి జీవితాల్లో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంట భోగి మంటల వెలుగులు , భోగ భాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలన్నారు. భోగి మంటలతో పీడనలన్నీ మటుమాయం కావాలని, అందరి జీవితాలు సకల సుఖ శాంతి సౌఖ్యానికి నిలయమై, కమనీయ అనుభూతులు మిగల్చాలని , సరికొత్త ఉషోదయానికి స్వాగతం పలకాలన్నారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలన్నారు. సంక్రాంతి సందర్బంగా చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు నామ చెప్పారు. ఈ సంవత్సరం అంతా మంచి వర్షాలతో పంటలు బాగా విస్తారంగా పండాలని, అన్నదాతలకు భోగ భాగ్యాలు కలగాలని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking