క్రీడాకారులకు బహుమతులు అందించిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు,బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 13 : రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవం సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిన్న ప్రారంభం అయిన కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు బజరంగ్,మహదేవ్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో బజరాంగ్ జట్టు ఘన విజయం సాధించింది.ఈ కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి హాజరై విన్నర్ రన్నర్స్ కు ట్రోఫీలు అందించడం జరిగింది.ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు10 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు రన్నర్స్ జట్టుకు 5000 రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడం జరిగింది.యువత స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని తాము ఎన్నుకున్న రంగంలో విజయం పట్టదలతో కష్టపడి సాధించింది జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిర పడాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమళ్ల హారి గోపాల్, బొప్పు కిషన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి, గుండా ప్రభాకర్, రమేష్ చంద్,వేముల మధు,శివ శంకర్,సిద్దు,బిట్టు,పాంచాల రమేష్,బాణాల రత్నం, వెంకట రమణ,గంగన్న తతిదరులు పాల్గొన్నారు.