నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం తుమ్మలగూడెం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంపును గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం శుభ సూచకమన్నారు.
గ్రామ ప్రజలందరూ హెల్త్ క్యాంపులు సద్వినియోగం చేసుకొని,టెస్టు చేయించుకోవాలని తెలిపారు.
అవసరమైన ప్రతి ఒక్కరు ప్రభుత్వం అందించే పది లక్షల ఆరోగ్య శ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.
