కాప్రవేణి నాగేష్‌ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలొ శ్రీమతి సోనియా గాంధీ గారి 78 వ జన్మదినం పురస్కారం పొందుకొని ఈ రోజు ఎంజే మార్కెట్‌ చౌరస్తా దగ్గర కాప్రవేణి నాగేష్‌ మరియూ ముండ్రాయి శ్రీనివాస్‌ ల అధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ పండ్లు పంచె కార్యక్రమం టప్పాసులు పేలిచి ఘనంగా నిర్వహించారు


ఈ సందర్భంగా తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకులు బండ అశోక్‌ మాట్లాడుతూ దశబ్దాల కాలంగా తెలంగాణా కొరకు ఎన్నో పోరాటాలు జరిగాయి.కాని ఆ పోరాటాలను గమనించిన శ్రీమతి సోనియా గాందీ తెలంగాణాను ఇచ్చిన దెవత అనిఅన్నారు.మాజి కార్పొరేటర్‌ శ్రీమతి మమత సంతోష్‌ గుప్తా మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాందీ లేకుంటే తెలంగాణా వచ్చేదే కాదని డిసెంబర్‌ 9ని సోనియాగాంధీ జన్మదినాన్ని మనం జరుపోకొవడం గర్వంగా ఉందని అని అన్నారు.

ఈ కార్యక్రమం లో గోషామహల్‌ సీనియర్‌ నాయకులు భద్రినాథ్‌,బండ అశోక్‌, వి జి పురుషోత్తం, బద్దం సతీష్‌ గౌడ్‌, గన్‌ఫౌండ్రీ మాజి కార్పొరేటర్‌ శ్రీమతి మమత సంతోష్‌ గుప్తా, చంద్ర మోహన్‌ యాదవ్‌, ప్రజాబలం శ్రీనివాస్‌,ఎస్‌ ధనరాజ్‌, డి రాజ్‌ కుమార్‌, పల్లెటి నగేష్‌, శ్రీమతి రోజి మేరీ, రాబర్ట్‌, బి వెంకటేష్‌, చే చేతన్‌ కుమార్‌, కోణంపేట నర్సింగరావు, జె మల్లేష్‌ లు వినోద్‌  కుమార్‌, అప్పు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన కాప్రవేణి నాగేష్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకులు బండ అశోక్‌ ,మాజి కార్పొరేటర్‌ శ్రీమతి మమత సంతోష్‌ గుప్తా గోషామహల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేసిన అందరికి నా హృవయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న అని అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking