గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 10 డిసెంబర్ 2024
తెలంగాణ ఉద్యమ సమయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం ధగ ధగా మెరిసిపోతూ నిండు ముత్తైదువలా నగలు, కిరీటం ధరించి, బతుకమ్మను ఒక చేత, పాడి పంటలు మరొక చేత బూని కనిపిస్తే ఆమె దొరసాని అని గేలి చేస్తూ అసలు తెలంగాణ తల్లే కాదనీ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి మారుతుందా అనే సందిగ్దానికి జవాబుగా సాదా సీదాగా కనిపించే హస్తం గుర్తుతో పేదరికాన్ని ప్రతిబింబిస్తూ ఉన్న కొత్త ప్రతిమను అసలు సిసలైన తెలంగాణ తల్లి అని ప్రస్తుత పాలకులు సచివాలయంలో స్థాపన చేసినందుకు నిరసనగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలభిషేకం గావించిన మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, అందె లక్ష్మణ్ రావు, గుట్టమిది నరేందర్, సంఘం శ్రీకాంత్, విటల్, ఉపేంద్రనాథ్ రెడ్డి, బుధోలు బాబు, భాను చందర్, యాలాల కిరణ్, షేక్ ఆరిఫ్, రాజేంద్రప్రసాద్, బొడ్డు శ్రీధర్, విజయలక్ష్మి, మహేశ్వరం సుమన్, ప్రవీణ్, రాజు, శ్రీనివాస చారి, తిరుపతి, మహేష్, ఉసేన్ తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.
Next Post