గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 10 డిసెంబర్ 2024
భారత రాష్ట్ర సమితి మణికొండ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో పురజనులు తీవ్రంగా ఎదుర్కుంటున్న సమస్యలలో ప్రధానముగా ట్రాఫిక్ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తేవడానికి ప్రజలకు, వాహన దారులకు వీసమెత్తు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సమస్యపై మణికొండ పైప్ లైన్ రోడ్డులో గల ఫ్రెండ్స్ కాలనీ దిలీప్ సూపర్ మార్కెట్ వద్ద నుండి మొదలు పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా దాదాపు వంద మంది పూర జనులతో సంభాషించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పైప్ లైన్ రోడ్ లో ఉన్న వైన్ షాపును తక్షణమే వేరొక చోటకు మార్చాలని, పైప్ లైన్ రోడ్ లోని డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దాలని, రోడ్డు ట్రాఫిక్ కు అనుకూలంగా కరెంటు స్తంభాలను జరపడం, పార్కింగ్ను సరిదిద్దడం, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడం, ఆర్.టీ.ఏ ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ ను నియంత్రించడం, వీధి లైటులు మొదలగు వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని, సమస్యలపై పుర జనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బి.ఆర్.సి, మర్రిచెట్టు, పంచవటి కాలనీ వరకు కూడలి రోడ్లలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరడమైనది. ఇట్టి కార్యక్రమానికి ప్రజలు ప్రత్యక్షముగా స్పందిస్తూ తాము ఎదుర్కుంటున్న విపరీత ట్రాఫిక్ సమస్య పరిస్థితిని కథలు కథలుగా వివరిస్తూ బాటసారులతొ కలసి వాహన దారులు స్వచ్ఛందంగా ఉత్సాహ భరితంగా భారత రాష్ట్ర సమితి తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలియ జేసినారని మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలుపుతూ ఈ కార్యక్రమంలో కుంబగళ్ళ ధనరాజ్, రూపా రెడ్డి, ముత్తంగీ లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, గుట్టమిది నరేందర్, ఏర్పుల శ్రీకాంత్, విటల్, సంఘం శ్రీకాంత్, మల్యద్రి నాయుడు, ఉపేంద్రనాథ్ రెడ్డి, బుధోలు బాబు, భాను చందర్, యాలాల కిరణ్, షేక్ ఆరిఫ్, రాజేంద్రప్రసాద్, బొడ్డు శ్రీధర్, కీర్తిలతా గౌడ్, విజయలక్ష్మి, దీపక్, సుమ, మంజు, అనుషా, మహేశ్వరం సుమన్, ప్రవీణ్, రాజు, శ్రీనివాస చారి, మహేష్, ఉసేన్ తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.