మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలి

సిఐటియూ గోషామహల్‌ జోన్‌ కన్వీనర్‌ కె. జంగయ్య
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 14 డిప్యూటీ కమిషనర్‌ కి మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సిఐటియూ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిఐటియూ గోషామహల్‌ జోన్‌ కన్వీనర్‌ కె. జంగయ్య మాట్లాడుతూ దూరప్రాంతాలలో ఉన్న మున్సిపల్‌ కార్మికులు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి డ్యూటీ కి వస్తు కాయకష్టం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు జీతాలు సరిపడక అష్టకష్టాలు పడుతున్నారని ఆయన తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలని , పర్మీనెంట్‌ చేయాలని అర్హులైన కార్మీకులందరికి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లాంగ్‌ టర్మ్‌ రాని , వయసు పైబడి , చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను వెంటనే తెలుసుకోవాలని ఆయన కోరారు. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నందువల్ల ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల ఫై పనిభారం పెరుగుతుందని ఆయన తెలిపారు. మున్సిపల్‌ సూపర్‌ వైజర్లకు నెలకు 35000 వేల వేతనం ప్రతి నెల పెట్రోల్‌ ఖర్చులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లలిత ,

Leave A Reply

Your email address will not be published.

Breaking