భౌతికకాయానికి నివాళులర్పించి అంత్యక్రియలలో పాల్గొన్న మువ్వ విజయ్ బాబు రాంరెడ్డి గోపాల్ రెడ్డి మేకల మల్లి బాబుయాదవ్

దనియాకుల హనుమంతరావు కు పితృవియోగం

ఇల్లందు ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన కొండాయి గూడెం పిఎసిఎస్ అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు తండ్రిగారైన ధనియాకుల వీరయ్య బుధవారం సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ టిపిసిసి నెంబర్ పుచ్చకాయల వీరభద్రం గురువారం భౌతికకాయానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తదనంతరం జరిగిన అంత్యక్రియలలో మల్లి బాబు యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కన్న తండ్రి లేని లోటు తీర్చలేనిదని వీరయ్య చాలా సౌమ్యూ లని గ్రామంలో ఇప్పటివరకు ఎవరితో తగవు అనే విషయం తెలియదని అలాంటి వ్యక్తి లేని కుటుంబం చాలా దురదృష్టకరమని, ఆ బాధను ఎవరు పూడ్చలేదని విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో కొండబాల కోటేశ్వరరావు దూళిపాల నాగేశ్వరావు మండల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి దమ్మాలపాటి సత్యం, భూక్య నాగేంద్రబాబు షేక్ ఫతేమహమ్మద్, మద్దినేని రమేష్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు బానోత్ నరసింహ నాయక్ మేకపోతుల మహేష్, దొడ్ల మల్లేశం, పాటిబండ్ల ప్రసాద్ చల్ల మల్లయ్య బండి లక్ష్మీనర్సు అంతోటి అచ్చయ్య, తోటకూరి శివయ్య, వడియాల కృష్ణారెడ్డి, మూడు కృష్ణప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking