వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గణేష్ బందోబస్తు లో పాల్గొన్న నిర్మల్ జిల్లా పోలీసు సిబ్బందికి నా సెల్యూట్: జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..భైంసా, ముదోల్, నిర్మల్ పట్టణం, ఖానాపూర్ ప్రాంతాలలో ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం*
వరుస నిమజ్జనాలతో వారం రోజులుగా కంటి మీద కునుకు లేని నిర్మల్ జిల్లా పోలీసులు*
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి*
క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ*
ఈనెల 7వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖలు అయన విద్యుత్,మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
నిర్మల్ పట్టణం లో కొందరు శోభాయాత్రను అర్ధరాత్రి,ఆ తర్వాత మొదలు పెడుతున్నారు.ఇలా చేయడం వల్ల గణేష్ విగ్రహాల నిమజ్జనాలు పూర్తవుడానికి మరుసటి రోజు వరకు సమయం పడుతోంది. దీనివల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఖైరతాబాద్ గణపతి కూడా అదే రోజు మధ్యానం వరకు నిమజ్జనం అవుతుంది, దాని అందరూ ఆదర్శంగా తీసుకుని వచ్చే ఏడాది నుంచైనా ఈ పద్ధతి మార్చుకోవాలి.నిమజ్జనం మొదలుపెట్టిన రోజే నిమజ్జనాలు పూర్తయ్యేలా చూసుకోవాలి అని ఎస్పి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking