రైల్వే పురోభివృద్ధి కి నామ కృషి

 

రైల్వే స్టేషన్లలో మౌళిక సదుపాయాల కల్పన

నామ కృషితో ఆర్వోబీ, ఆర్యుబీ, రోడ్ అండర్ పాస్ ల నిర్మాణం

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 24 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైల్వే పురోభివృద్ధికి అహర్నిశలు చేసిన కృషి ఫలితంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ఎంతో అభివృద్ధి సాధించామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పార్లమెంట్ లో మాట్లాడడంతో పాటు ప్రధాన మంత్రి ని, రైల్వే మంత్రులను, ఇతర కేంద్ర మంత్రులను కలిసి, మాట్లాడి, లేఖలు అందించిన ఫలితంగా పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైల్వే మార్గాలు, ఆర్వోబీ, ఆర్యూబీ, అండర్ పాస్ ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఈ నెల 26న ప్రధాని ప్రారంభించే ముత్యాలగూడెం, మీనవోలు అండర్ పాస్ , కొత్తగూడెం రోడ్ ఓవర్ బ్రిడ్జి, డోర్నకల్ పాపటపల్లి రోడ్ అండర్ పాస్, మధిర – మోటమర్రి, ఎర్రుపాలెం – తొండలగోపవరం రోడ్ అండర్ పాస్ ల కోసం లోక్ సభలో పలుమార్లు ప్రస్తావించి, రైల్వే మంత్రితో మాట్లాడి, మంజూరుకు కృషి చేయడం జరిగిందని నామ తెలిపారు. జిల్లాలో అమృత్ భారత్ పధకం కింద ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం, కొత్తగూడెం , మణుగూరు తదితర రైల్వే స్టేషన్ల పురోభివృద్ధికి కృషి చేసి, నిధులు మంజూరు చేయించి, మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మం రైల్వే స్టేషన్ సర్వోతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు నామ నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం నాడు పార్లమెంట్ లో మాట్లాడడం తో పాటు 125 లేఖలు రాయడం జరిగిందని నామ గుర్తు చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking