బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేనావత్ రవి నాయక్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 24:
బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాచారం. కు చెందిన నేనావత్ రవి నాయక్ మూడవసారీ నియమితులయ్యారు.
ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ
మూడవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, ,జిల్లా పార్టీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయేరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల పక్షాన హక్కుల సాధనకోసం పెద్ద ఎత్తున పోరాడతానని అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ని గెలిపించడానికి గిరిజనులందరినీ ఏకం చేస్తానని రవి నాయక్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking