జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 23 (ప్రజాబలం) ఖమ్మం రబీ 2022-23 సీజన్ కు సంబంధించిన దాన్యం తాలూకు బియ్యం ఎఫ్సీఐ వారికి నిర్ణీత గడువులోగా అందజేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పౌరసరఫరాల అధికారులను, రైస్ మిల్లర్స్ యజమానులను ఆదేశించారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు రైస్ మిల్లర్స్ యాజమాన్యంతో పెండింగ్ ధాన్యం సరఫరాపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ 2022-23 సీజన్ నకు సంబదించిన దాన్యం తాలూకా బియ్యం జిల్లాలోని రైస్ మిల్లర్లు ఇప్పటివరకు కేవలం 21% బియ్యంను మాత్రమే సరఫరా చేసియున్నారు అని, మిగతా 79% బియ్యంను ఎఫ్ సి ఏ వారికి త్వరతగతిన సరఫరా చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా, ప్రతి మిల్లరు తప్పని సరిగా ప్రతి రోజు వారికి కేటాయించిన దాన్యమును మర పట్టించి ఎఫ్ సి ఐ వారికి బియ్యం సరఫరా చేయవలసినదిగా ఆదేశించారు సమావేశం నందు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ సురేందర్, జిల్లా రైస్ మిల్లర్స్ సంగం అద్యక్ష, కార్యాదర్శులు రాజేశ్వరరావు, నగేష్, పౌర సరఫరాల చెకింగ్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు
