ఈనెల 30న జాతీయ లోక్‌ అదాలత్‌

కరీంనగర్‌ ప్రజాబలం ప్రతినిధి: డిసెంబర్‌ 30న కరీంనగర్‌, హుజురాబాద్‌ కోర్టుల పరిధిలో జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం జర
గుతుందని జిల్లా న్యాయసేవా ఆధికార సంస్థ సెక్రటరీ కె వెంకటేష్‌ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌ కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌ భవనంలోజిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కె వెంకటేశ్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయసేవా ఆధికారి సంస్థ ఢల్లీి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా ఆధికార సంస్థ హైదరాబాద్‌ వారి ఆదేశాల మేరకు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో
డిసెంబర్‌ 30న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
హుజురాబాద్‌ కోర్టులో 3 బెంచీలు, కరీంనగర్‌ కోర్టులో 6 బెంచీలను ఏర్పా టు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాజీపడద
గిన క్రిమినల్‌ కేసులు, సివిల్‌, కుటుంబ తగాదాలు, చెక్కు బౌన్స్‌ కేసులు, మోటారు వాహనాల చట్టం కేసులతో పాటు డ్రంకన్‌ డ్రైవ్‌, పెట్టి కేసులను
పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 2021 క్రిమినల్‌, 350 సివిల్లు, మొత్తం 2371 రాజీమార్గం ద్వారా పరిష్కా రం చేసుకోగల కేసులను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఇవికాకుండా పెట్టి చాలాన్‌ కేసులు, డ్రంకన్‌ డైవ్‌ కేసులు కూడా వేలలో ఉన్నాయన్నారు
లోక్‌అదాలత్ను ఆశ్రయించడం ద్వారా ఫైన్‌, కేసులలో కొంత వెసలుబా టును ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కక్షిదారులు దీనిని సద్వినియోగం
చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking