ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07 : మంచిర్యాల జిల్లాలో చెన్నురు మండలంలోని రాపన్ పల్లి గ్రామంలో రైతు అంకయ్య గ్రామంలోని పంట సేనులో నవభారత్ సీడ్స్ ప్రై లిమిటెడ్ వారి గ్లోరి పత్తి సీడ్స్ పై క్షేత్ర స్థాయిలో పరిశీలన జూనియర్ సేల్స్ ఆఫీసర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంపెనీ ప్రతినిధి టెర్రిటరీ మేనెజర్ ప్రమోద్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నవభరత్ ప్రై లిమిటెడ్ వారి గోర్లి అనే రకం ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మలు కలిగి వుండి,పెద్ద పెద్ద కాయలతో చిక్కటి కాపుతో రసం పీల్చు పురుగుల నుండి సమర్థ వంతముగా తట్టుకోనే శక్తితో,ప్రతి కూల పరిస్థితిలోను తట్టుకోని మరల మరలా గూడపూత కాయలు వచ్చే లక్షణాలు కల్గివుంటుంది,వర్షా ధారము,నీటీపారుదల క్రింద సాగుకు అనువైనది,పెద్ద పెద్ద కాయలతో చక్కటి కాపుతో వుండటంవల్ల పత్తి తియడం సులువు,ఇలా వుండటం వల్ల రైతులకు ఎక్కువ లాభం అని తెలిపారు.ఈ కార్యక్రమానికి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్, సుమారు 180 మంది రైతులతో ఈ కార్యక్రమానికి నిర్వహించారు.