ప్రపంచంతో పోటీపడేలా విద్యపై దృష్టి పెడతాం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావలసిన నిధులు కేటాయించి విద్యపై దృష్టి పెడతామని చెప్పాము ఆ మేరకు పనులు ప్రారంభిస్తున్నాము.
ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ను 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 12వ తరగతి వరకు విద్యనందిస్తాం.
ప్రస్తుతం రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్‌ కళాశాలలు పక్కాభవనాలు లేక కళ్యాణ మండపాలు, అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని 1023 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో ఉంటే అందులో 662 స్కూల్స్‌ కు బిల్డింగ్స్‌ లేవు.
బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో 327 ఉంటే అందులో 306 స్కూల్స్‌ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కు సంబంధించి 268 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉంటే.. 135స్కూల్స్‌ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ విషయానికి వస్తే 185 ఉంటే.. 42 స్కూల్స్‌ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
మైనారిటీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కు వస్తే.. 205 ఉంటే 179 స్కూల్స్‌ అద్దె భవనాల్లో ఉన్నాయి.
మౌలిక వసతులు, సమగ్రమైన అధ్యపక వ్యవస్థ లేకుండా మనం లక్ష్యాలను సాధించలేము.
గత ప్రభుత్వం ఇందుకోసం రూ.100 కోట్లలోపే ఖర్చు చేసింది.
బలహీన వర్గాలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి నియోజకవర్గములో 20 నుంచి 25 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మిస్తాం.
ఇప్పటివరకు 25 నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి కావాల్సిన భూమి ఇతర వివరాలు పంపారు.
వాటిని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా నిర్మాణాలు ప్రారంభిస్తాం.
దసరా పండగకు ముందు రోజే రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి భూమి పూజ చేస్తాం
గత కొన్ని సంవత్సరాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, గాలివాటం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆధునిక రెసిడెన్షియల్‌ భవనాల నిర్మాణం జరుగుతుంది.
గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు అన్ని వర్గాల వారు కలిసి ఒక చోట ఓ కుటుంబములా చదువుకునే లా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ తో భవనాల నిర్మాణం జరుగుతుంది
ూ చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఏ కొరత లేకుండా చూసే కార్యక్రమంలో భాగంగా థియేటర్‌ నిర్మించి శాటిలైట్‌ ద్వారా పిక్చర్స్‌ సైతం ప్రదర్శించే ఆలోచనలో ఉన్నామన్నారు.
పేద వర్గాల వారు వారి బిడ్డలను ఈ పాఠశాలల్లో చేర్పించి విరివిగా ప్రచారం నిర్వహించాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల నిర్మాణానికి మూడు నెలలుగా కసరత్తు చేసి ఓ రూపానికి తెచ్చిన యావత్‌ మంత్రిమండలి, చీఫ్‌ సెక్రటరీ మొదలు వివిధ శాఖల ఉన్న అధికారులకు అభినందనలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking