ఎంపీగా నీలం మధునుగెలిపించుకొని సీఎం రేవంత్ కు గిఫ్ట్ ఇవ్వాలి

మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ మంత్రివర్యులు కొండా సురేఖ

ప్రజాధనాన్ని దోచుకున్న వారిని కాంగ్రెస్ వదిలిపెట్టదు

టిఆర్ఎస్ను వెంటాడుతున్న లిక్కర్, ఫోన్ టాపింగ్ కేసులు

 బిజెపి అభ్యర్థి మాటల మనిషి

 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ

సంగారెడ్డి ఏప్రిల్ 3 ప్రజ బలం ప్రతినిది:

Neelam Madhu should win as MP and give gift to CM Revanthమెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ కొండా సురేఖ పిలుపు నిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ… మెదక్ పార్లమెంటు స్థానం ప్రత్యేకమైనదని, ఈ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ఉందని అలాగే, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు నియోజకవర్గం కూడా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతోనే ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకొని ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం నియోజకవర్గ ఇన్చార్జులు నాయకులు కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత తొమ్మిదేళ్ల కాలంలో అవినీతి అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని, అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు.

Neelam Madhu should win as MP and give gift to CM Revanth

మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా భారీ అవినీతి, అక్రమాలకు తెర లేబడమే కాకుండా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రస్తుతానికి టిఆర్ఎస్ను లిక్కర్, ఫోన్ టాపింగ్ కేసులు వెంటాడుతున్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, టిఆర్ఎస్ కుటుంబం లాభ పడిందని అన్నారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుతుందని, ఇక ఫోన్ టైపింగ్ కేసులో తీగలాగితే డొంక కదిలిన చందంగా అనేక విషయాలు బయటకు బయటకు రావడం మీడియా కథనాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్దవారు ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతానికి పొలం పాట పట్టిన మాజీ సీఎం కేసీఆర్, ఆనాడు కొండగట్టు లో జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలానికి వెళ్లి పరామర్శించిన వారిలో కెసిఆర్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ? చెప్పాలని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక మహిళకు కూడా క్యాబినెట్లో చోటు ఇవ్వలేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ కు ఓ బానిస, ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు. మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు పార్లమెంటు ఎన్నికల్లో ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ బయటకు వచ్చాడని విమర్శించారు. ఇకపోతే బిజేపి అభ్యర్థి రఘునందన్ మాటల మనిషే గాని చేతల మనిషి కాదని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుతో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం వచ్చిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని బిఆర్ఎస్, బిజేపిలు కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు. ఈ మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లకు బుద్దిచెబుతూ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుని, సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Neelam Madhu should win as MP and give gift to CM Revanth

ఇందుకోసం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,TSIIC చైర్మన్ & సంగారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి గారు,పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధా, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి, గజ్వేల్ నర్సిరెడ్డి,మెదక్ రోహిత్, సిద్దిపేట్ పూజల హరికృష్ణ, డిసిసి ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్, పట్టణ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking