మహంకాళి విధిలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం…

 

ప్రజాబలం న్యూస్ తూప్రాన్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డ్ లోని మహంకాళి వీధిలో నూతనంగా సిసి రోడ్ ప్రారంభం అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సోలార్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు తూప్రాన్ లో నెలకొన్న సమస్యలను పెద్ద ప్రాతిపదికన పరిష్కరిస్తానని తెలిపారు. వార్డులలో ఎలాంటి ఏ సమస్యలున్నా తనకు తెలిపాలని చిన్న చిన్న పనులను గుప్త ప్రాతిపదికన చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, రాజు ,నర్సోజి , నాయకులు పల్లెర్ల రవీందర్ గుప్తా, రఘుపతి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ , మేనేజర్ రఘువరన్, ,మున్సిపల్ ఆర్ ఐ రమేష్ , జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి, చిన్న నాగరాజుగౌడ్ , శ్రీకాంత్ , బొల్లు నాగులు, శ్రీనివాస్, అజార్, సమీర్, అనిల్, ఉమర్, వార్డ్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking