ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సికింద్రాబాద్‌ జిల్లా లో పాఠశాల ల బంద్‌ విజయవంతం

డిమాండ్స్‌
ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి…
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, ఉపాధ్యాయ కొరత లేకుండా అధ్యాపక అధ్యపై కేతర సిబ్బందిని నియమించాలి…
ఖాళీగా ఉన్నటువంటి %ణజుూ,వీజుూ%పోస్టులను భర్తీ చేయాలి…
విద్య హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలలో 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించాలి…
ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలి…
సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:బుధవారం నాడు ఏబీవీపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ జిల్లా లో అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు,నగరాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల బంద్‌ నిర్వహించి క్లాసెస్‌ బైకాట్‌ చేయడం జరిగింది.
మీడియాతో ఏబీవీపీ సికింద్రాబాద్‌ జిల్లా కన్వీనర్‌ చెర్క.బాలు మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టంని పక్కడ్బందిగా అమలుచేయాలని ప్రభుత్వంని డిమాండ్‌ చేశారు..
,అలాగే విద్యా హక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు సికింద్రాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను బంద్‌ చేయడం జరిగింది, బంద్‌ చేయని పాఠశాలాలకి వెళ్లి యాజమాన్యం తో మాట్లాడి బంద్‌ ప్రకటించి విద్యార్థులని బంద్‌ లో భాగం చేయడం జరిగింది
ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి వచ్చింది..ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టంకి వ్యతిరేకంగా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నా,ప్రభుత్వం అనుమతులు లేకుండా పాఠశాలని నడుపుతున్నకూడా అధికారులు పట్టిచుకోకపోవడం చాలా దురదుష్టకరం అన్ని అన్నారు… ప్రవేట్‌ కార్పోరేట్‌ పాఠశాలలను వ్యాపారంగా చేసుకోని పుస్తకాలు,యూనిఫామ్‌ అమ్ముకుంటూ వేలకు వేలు వసూలు చేస్తూ విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు… అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలల పైన చర్యలు తీసుకొని నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలకు గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ డిమాండ్‌ చేస్తుంది… అదేవిధంగా రేవంత్‌ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నపుడు %ణూజ% లో ఉన్న 25000 ఉద్యోగాలు భర్తీ చెయాలి అన్ని అన్నారు… ప్రస్తుతం వారి ప్రభుత్వం ఉన్న కూడా పూర్తి మొత్తం లో ఉద్యోగ నోటిఫికేషన్‌ భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది సత్వరమే కాలీలా భర్తీ చేయాలని అలాగే ప్రైవేట్‌ పాఠశాలలో 25% పేద మధ్య తరగతి విద్యార్థులకు కేటాయించాలి. ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ డిమాండ్‌ చేస్తుంది…

Leave A Reply

Your email address will not be published.

Breaking