
ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకం
ప్రజాబలం 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభలో సి. కృష్ణ యాదవ్ హైదరాబాద్ జనవరి 8: ప్రభుత్వ ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధి పత్రికలని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో పత్రికల పాత్ర కీలకమని మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రజాబలం 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది ఈ సభకు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ,ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైంది అన్నారు.

వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఏ అధికారి గాని రాజకీయ నేతలకు గాని భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేలపై ఉందన్నారు. ప్రజలకు బలం పత్రికలని అన్నారు. అందుకే ప్రజల పక్షాన నిలిచే ‘ప్రజాబలం’ పత్రిక ప్రజలకు అన్నివేళలా అండగా ఉండగలదన్న ఆశాభావాన్ని కృష్ణ యాదవ్ వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజాబలం దినపత్రిక మరింత ముందుకు వెళ్లాలని కృష్ణ యాదవ్ ఆకాంక్షించారు. అనంతరం భగవంతు రావు మాట్లాడుతూ పత్రికలు లేకుండా నేటి సమాజంలో ప్రజల మనుగడ అసాధ్యం అన్నారు.

పత్రికలు గాని మీడియా కానీ ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తూ చైతన్య పరచడంలో వాటికవే సాటి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, యాదగిరిగుట్ట అష్టలక్ష్మి టెంపుల్ అధ్యక్షులు అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ, మైనంపల్లి హనుమంతరావు ట్రస్ట్ చైర్మన్ మోహన్ రెడ్డి, తెలంగాణ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కేసరి వెంకటేశ్వర్లు, ఉర్దూ పేపర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే లక్ష్మణరావు, ప్రగతి మహావిద్యాలయ కార్యదర్శి జిగ్నేష్ జోషి, తెలంగాణ రైతు హక్కుల పోరాట సమితి చైర్మన్ కొమ్ము ప్రేం సాగర్ యాదవ్,గ్రందాలయ నగర మాజీ చేర్మెన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, కీర్తి అవార్డు గ్రహీత మానస ఆర్ట్ థియేటర్స్ అధినేత రఘు శ్రీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏ పుష్పలత,ప్రధాన కార్యదర్శి నల్ల మంజులత,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వి.రాజు గుప్తా ప్రజాబలం ఎడిటర్, పబ్లిషర్ ఏ.స్రవంతి, చీప్ బ్యూరో శ్రీనివాస్ తో పాటు ప్రజాబలం దినపత్రిక కు చెందిన ఆయా జిల్లాలకు చెందిన స్టాఫ్ రిపోర్టర్లు ,రిపోర్టర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనారు.
