ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ప్రధాని మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా రూపుదిద్దిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు.వరుసగా 7వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారని తెలిపారు.
మహిళల నేతృత్వంలో దేశాభివృద్ధిని ప్రోత్సహిస్తూ, మహిళలు మరియు బాలికలకు ప్రయోజనం చేకూర్చే విధంగా, 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను 3 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.
భారత దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలకు వెనుదన్నుగా.
గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్ల నిధులు కేటాయించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.
ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.
అందరికీ పుష్కలమైన అవకాశాలను కల్పించడం కోసం 2024-25 బడ్జెట్ లో 9 ప్రధాన అంశాల పై దృష్టి సారించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం:
1) వ్యవసాయంలో ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత
2) ఉపాధి మరియు నైపుణ్యం
3) సమగ్ర మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం
4) తయారీ మరియు సేవలు
5) పట్టణాభివృద్ధి
6) ఇంధన భద్రత
7) మౌలిక సదుపాయాలు
8 ) ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి
9) భవిష్యత్ తరం సంస్కరణలు
Next Post