మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 23:
పల్లె దవఖానాను పేద ప్రజలకు ఉపయోగపడేలా ప్రచారాలు నిర్వహించి ఔట్ పేషంట్స్ శాతాన్ని పెంచాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం అన్నారు.
మంగళవారం పర్యటనలో భాగంగా అన్నోజిగూడ లోని పల్లె దవఖానాను పరిశీలించి, పల్లె దవఖానాను పేద ప్రజలకు ఉపయోగపడేలా ప్రచారం చేసి, ఔట్ పేషంట్ శాతాన్ని పెంచాలని డాక్టర్ కు సూచించారు. పల్లె దవఖానాను పరిశీలించి ప్రతిరోజు ఔట్ పేషంట్స్ ఎంత మంది వస్తారు, మున్సిపాలిటిలో జనాభా ఎంత అని డాక్టరు, ఎఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు సుమారుగా 30 మంది ఔట్ పేషంట్స్ వస్తారని డాక్టర్ తెలుపగా, ఓపిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ సిబ్బందితో స్లమ్ ఏరియాలలో పల్లె దవఖాన గురించి ప్రచారం చేసి, క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకు సేవలందించాలన్నారు. దవఖానాలోని రిజిష్టర్లను కలెక్టరు పరిశీలించి తగు సూచనలు చేసారు. అనంతరం ప్రతాపసింగారం లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అంగన్వాడీ సెంటర్లను, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు.