ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్మకాలపై నిర్మల్ జిల్లాపోలీసుల ఆకస్మికదాడులుసుమారుగ 5 లక్షల రూపాయల విలువచేసే సామగ్రి స్వాధీనం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు, గంజాయి అక్రమ రావాణాపై ఉక్కు పాదం మోపుతూ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో అసాంఘిక,చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన పోలీసు బృందాలు.జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించడం జరుగింది.ఈ దాడులలో భాగంగా నిర్మల్ పట్టణం లో సుమారుగా 5 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివిధ షపులలో మరియు గోదాముల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్ముతున్నారన్న పక్క సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు దొరికాయి. తెలంగాణ ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్రొడక్ట్స్ స్వాధీనపరుచుకొని విచారణకై నిర్మల్ పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించనైనది.
జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన 8712659599/95 నెంబర్కు సమాచారం తెలుపవలసిందిగా ఎస్పి తెలియజేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు
ఈ దాడులలో నిర్మల్ పట్టణ మరియు రూరల్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, శ్రీనివాస్ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking