జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 194 ఆర్జీలు
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, ఫిబ్రవరి 24: సీనియర్ సిటీజన్ గుర్తింపు కార్డుల జారీలో జాప్యం చేయరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి కమీషనర్ ఇలంబర్తి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం దిశగా సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో ఆయా విభాగాలకు సంబంధించి అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. సీనియర్ సిటిజన్ కార్డుల జారీలో జాప్యం చేయకుండా త్వరితగతిన కార్డులు జారీ చేయడంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా విభాగాలకు సంబంధించిన ఆర్జీలను వేగవంతంగా పరిష్కరించడం పై దృష్టి సారించాలని తెలిపారు.

జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 82 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 46, శానిటేషన్ విభాగానికి 5, ట్యాక్స్, హెల్త్ విభాగాలకు 4 చొప్పున, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు 3 చొప్పున, ఎఫ్.ఏ, ఎలక్ట్రికల్, ల్యాండ్ అక్విజిషన్, సిపిఆర్‌ఓ, యు.బి.డి విభాగాలకు 2 చొప్పున, హౌసింగ్ విభాగానికి ఒక ఫిర్యాదు అందగా, ఫోన్ ఇన్ ద్వారా 6 ఫిర్యాదులు అందాయి.
జిహెచ్‌ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 112 అర్జీలు అందాయని, అందులో కూకట్ పల్లి జోన్ లో 51, ఎల్బీనగర్ 13, శేరిలింగంపల్లి జోన్ 12, సికింద్రాబాద్ జోన్ లో 27, చార్మినార్ జోన్ లో 8, ఖైరతాబాద్ జోన్ లో ఒక్క ఫిర్యాదు అందిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్లు శివ కుమార్ నాయుడు, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి రావు,సి సి పి శ్రీనివాస్,, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, సి.ఎం.హెచ్.ఓ డా.పద్మజ, అడిషనల్ సి.సి.పి లు ప్రదీప్, గంగాధర్, వెంకన్న,రంజిత్ కుమార్,వాటర్ వర్క్స్ జోనల్ మేనేజర్ సాయి రమణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్, యు బి డీ డైరెక్టర్ వేంకటేశ్వర రావు, యు సి డీ పీ డి దేవేందర్ రెడ్డి, ఎస్టేట్ అధికారి ఉమా ప్రకాష్, జె.సి రెవెన్యూ మహేష్ కులకర్ణి, డిప్యూటీ సీఈ పనసారెడ్డి ఇరిగేషన్ ఈ ఈ నారాయణ, తదితరులు పాల్గొన్నారు..