ఖమ్మంనల్గొండవరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి గా పురుషోత్తం రెడ్డి తాలకోల

టీచర్స్‌ 2030 మేనిఫెస్టో ఆవిష్కరణ
ఖైరతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:పటిష్టమైన విద్యా వ్యవస్థ,ఉపాధ్యాయ సేవే పరమావధిగా ఖమ్మంనల్గొండవరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్నానని పురుషోత్తం రెడ్డి తాలకోల తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రైవేట్‌ విద్యాసంస్థల సమస్యలపరిష్కారానికి రూట్‌ మ్యాప్‌ పేరుతో ‘‘టీచర్స్‌ 2030మేనిఫెస్టో నుఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ… తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే ఆరు సంవత్సరాల లో మానిఫెస్టోలో పొందుపరిచిన విద్యాపరమైన పరిపాలన సమస్యలను, విద్యార్థుల ఉపాధ్యాయుల ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాల సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలల సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. 40 సంవత్సరాలుగా విద్యారంగంలో అపారమైన అనుభవం కలిగిన తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని, విద్యావంతులను మేధావులను కోరిన పురుషోత్తం రెడ్డి తలకోల. ఈ కార్యక్రమంలో డా. బి విజయ్‌ కుమార్‌, డా. ఈ రాజిరెడ్డి, భాస్కర్‌ రుద్ర రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking