నోడల్ అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)6 అక్టోబర్:
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని నోడల్ అధికారులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి అంశాలను తెలియజేయాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా నోడల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో నోడల్ అధికారులకు ఎంతో బాధ్యత ఉంటుందని దీనిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. అలాగే నోడల్ అధికారులకు అప్పగించిన పనులు ఎంత వరకు వచ్చాయి.ఏఏ స్థాయిలో ఉన్నాయనే వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులకు కలెక్టర్ అమోయ్ కుమార్ వారి విధులు తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. దీంతో పాటు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో అన్ని విషయాల్లో నిబంధనల ప్రకారం తమ విధులు నిర్వహించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking