మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)6 అక్టోబర్:
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ పొందిన అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో వారు శిక్షణ పొందిన సమయంలో తెలిపిన నియమ, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, FST, VST, VVT, SST మరియు MCC జట్ల టీమ్ హెడ్,5. అసిస్టెంట్ ఎక్స్అబ్జర్వర్లు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ ఎన్నికలకు సంబంధించి శిక్షణలో అధికారులు నేర్చుకొన్న వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో శిక్షణ పొందిన వారు ఒకటికి పదిమార్లు ప్రచారం నుంచి మొదలుకొని ఎన్నికల కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్, ప్రచారం, ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చు తదిరత అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని దీనిపై శిక్షణలో అందచేసిన పుస్తకాలు, ఇతర మెటీరియల్ పూర్తిగా చదవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ పొందిన అధికారులు, సిబ్బందికి ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలని అలాగైతేనే విజయవంతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని మర్చిపోరాదని ఈ విషయంలో ఏమైనా అనుమానాలు, ఇబ్బందులు, తెలియని విషయాలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలో ఎన్నికల సమయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని అందుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అమోయ్ కుమార్ వారు నిర్వహించాల్సిన విధులు, నిబంధనలపై ప్రత్యేకంగా ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకొని… చేపట్టాల్సిన విధులను కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. న్నారు. అనంతరం వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, శిక్షణ పొందిన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్, అసిస్టెం రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.