రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా నోట్ బుక్ పంపిణీ

 

భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ

ఎన్ ఎస్ యూ ఐ మండల అధ్యక్షుడు ముత్తె చందు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : భావిభారత ప్రధాని,భరత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వాడు రాహుల్ గాంధీ అని ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడు ముత్తె చందు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ముత్తె సుధాకర్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పెన్సిల్,స్కెచ్ పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…దేశం కోసం ప్రాణాలు అర్పించింది గాంధీ కుటుంబం అన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవిని,2004, 2009 లో ప్రధాని పదవిని త్యాగం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking