జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి సెప్టెంబర్ 10
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్ ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్ హైదరాబాదులో కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తూ 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. ఇలా ఎన్ ఎస్ యు ఐ నాయకుని హోదా నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమించడం ఆనందదాయకంగా ఉందని మరియు పార్టీలో నిజాయితీగా కష్టపడ్డ వ్యక్తులకి ఏనాటికైనా తగిన గుర్తింపు వస్తుందని ఇదే స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ ఉత్సాహంతో పని చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్, ఎన్ ఎస్ యు ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్, ఎన్ ఎస్ యు ఐ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు సమీర్, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.