పౌషకాహారాల అల్పాహారాన్ని సరఫరా

వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో మణికొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 206 మంది విద్యార్థిని విద్యార్థులకు 11 రకాల మిశ్రమ ధాన్యాలతో తయారు గావించిన పౌషకాహారాల అల్పాహారాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్ గారి సమక్షంలో గత వారం మొదలు పెట్టీ, ఈ రోజు సోమవారం సాయంత్ర సమయాన ట్రస్ట్ సభ్యులైన రచ్చా శ్రీనాథ్ గారి సహాకారముతో సరఫరా చేయడం జరిగినదని వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తు ఇట్టి దిన చర్య రాబోయే మార్చి 15 వరకు స్వచ్ఛంద సంస్థలు, పురజనులు స్వచ్ఛందముగా ముందుకు వచ్చి వారి వారి ఇస్టానుసారం అల్పాహారాన్ని సమకూర్చి విద్యార్ధుల సౌకర్యార్ధం ముందుకు రావాలని కోరడం వలన బీ.ఆర్.సి కి ఎదురుగా గల గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ లో నివసించే వయో వృద్దుల అసోసియేషన్ సభ్యులు ముందుకు రావడం చాలా సంతోషకర విషయమని ట్రస్టీ లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ, పురజన పెద్దలందరు ఈ విషయమై ముందుకు వచ్చి తోచిన తిను బండారాలను పిల్లలకు అందజేసే ఏర్పాటు చేయలని విన్నవించుకుంటు, ఎవ్వరూ ముందుకు రాని రోజులలో వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో మంచి మంచి పోషక పదార్థాలతో కూడిన సాయంత్రపు తిను బండారాలను విద్యార్థిని విద్యార్థులకు అందించడానికి సాయ శక్తుల ప్రయత్నిస్తామని తెలియ జేసినారు. ఇట్టి సమయంలో ట్రస్టు సభ్యులు అందె లక్ష్మణ్ రావు, మణికొండ 8 వ వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్ మరియు గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్ నివాసులు కామేశ్వర రావు, సుబ్రమణ్యం, లక్ష్మణ్ రావు, స్కూల్ టీచర్లు ఆదిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking