నిర్మల్ జిల్లా యువత ఇతరులకు ఆదర్శంగా ఉండాలి

వాహనల నిబంధనలు పాటించేలా గ్రామాల్లో యువతకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ముఖ్యంగా యువత ఇతర వాహనదారులకు ఆదర్శంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల. సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ శాఖ ముదుండి ఎలాంటి అదనపు రుసుములు లేకుండా కేవలం ప్రభుత్వానికి చెల్లించే చాలాను డబ్బులను చెల్లించిన 27 మంది మారుమూల ప్రాంతాల్లోని గిరిజన యువకులకు సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సులను జిల్లా ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా వాహనాలను డ్రైవింగ్ చేసే వారికి లైసెన్స్ ఆవశ్యకతను స్పష్టంగా వివరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతే భీమా కంపెనీల నుండి ఎలాంటి పరిహారం రాదని, దీనితో వాహన యజమాని బాధిత కుటుంబాలకు సొంతంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో జరిమానాలు చెల్లించి ఆర్థికంగా నష్టపోకూడదని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి, గ్రామీణ సిఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking