ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని సూరారం రైతు వేదిక యందు న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మంగళవారం ఈ కార్యక్రమనికి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ కం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మారం రెడ్డి అర్పిత,డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ సందాని,మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వ్యవసాయ విస్తరణ అధికారులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని రైతులకు చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు న్యాయపరమైన సలహాలు మరియు సూచనలకు వారిని సంప్రదించవలసిందిగా సీనియర్ సివిల్ జడ్జ్ రైతులకు తెలియజేయడం జరిగింది.టోల్ ఫ్రీ నెంబర్ 15 100 నెంబర్ ను న్యాయ సలహాలకు సంప్రదించవలసిందిగా తెలియజేయడం జరిగింది.